MKOne Telugu Times Youtube Channel

రాజాసింగ్ పై మరో కేసు

రాజాసింగ్ పై మరో కేసు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై మరో కేసు నమోదైంది. మత విద్వేషాలు చెలరేగేలా ప్రసంగించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాజస్థాన్‌ పోలీసులు కేసులు నమోదు చేసారు. మహారాణా ప్రతాప్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల రాజాసింగ్‌ రాజస్థాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. కున్హాడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రతాప్‌ చౌక్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాగా, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని కున్హాడి పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 153 ఏ ప్రకారం కేసులు పెట్టారు.

 

 

Tags :