Radha Spaces ASBL

విడుదలకు సిద్ధమైన భార్గవి క్రియేషన్స్ వారి "రాజ్ కహాని" చిత్రం

విడుదలకు సిద్ధమైన భార్గవి క్రియేషన్స్ వారి "రాజ్ కహాని" చిత్రం

భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలు గా రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం "రాజ్ కహాని". ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ తో పాటు బెంగుళూర్, కర్ణాటక ప్రాంతాలలోని పలు పర్యాటక ప్రాంతాలలో ఈ సినిమా తెరకెక్కించగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని U/A  సర్టిఫికెట్ అందుకుంది.

చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ..  అమ్మ ప్రేమను అంతర్లీనంగా, అమ్మాయి ప్రేమను బాహ్యవలయంగా చేసుకుని అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాను ప్రేక్షక లోకం తప్పక ఆదరిస్తారని నమ్మకం వ్యక్తపరుస్తున్నాను అన్నారు.

నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికేన్ రాజు మాట్లాడుతూ.. మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది.  ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చేసాము. తొందరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము. యూత్ ని,  ఫ్యామిలీని అకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రం లో ఉన్నాయని తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :