Radha Spaces ASBL

శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో రాహుల్ గాంధీ కి ఘన స్వాగతం... నేటి నుంచి అమెరికా పర్యటన...

శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో రాహుల్ గాంధీ కి ఘన స్వాగతం... నేటి నుంచి అమెరికా పర్యటన...

నేడు (30 మే 2023) న శాన్ ఫ్రాన్సిస్కో నగరం చేరిన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ కి అమెరికా లోని కాంగ్రెస్ అభిమానులు, ఇండియన్ నేషనల్ ఓవర్ సీస్ కాంగ్రెస్ (INOC) సభ్యులు ఘన స్వాగతం తెలిపారు. 

అయితే రాహుల్ గాంధీ సామాన్య ప్రయాణీకులతో కలిసి ఇమ్మిగ్రేషన్ ప్రొసీజర్ తీసుకొని ఐర్పోట్ బయటకు రావడం జరిగింది. ఇతర ప్రయాణీకులతో కలిసి సెల్ఫి లు ఇస్తూ బయటకు వచ్చిన రాహుల్ గాంధీ 'నేను ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదని, సామాన్య ప్రయాణీకుడినే.. ఇలాగ వుండటమే నాకు ఇష్టం' అని తెలిపారు. 

చికాగో నుంచి వచ్చిన  కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి, చైర్మన్ - INOC, శ్రీ శామ్ పిట్రొడ, ఇతర IOC సభ్యులు, శ్రీ మధు యాష్కీ, మాజీ ఎంపీ, శ్రీమతి ఝాన్సి రెడ్డీ, WETA అధ్యక్షులు ఇతర ప్రముఖులు  ఆయన కు ఘన స్వాగతం తెలిపారు.

శ్రీ రాహుల్ గాంధీ శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూ యార్క్ నగరాలలో ఇండియన్ అమెరికన్లు, ఇతర నాయకులను కలుస్తారు. 4 జూన్ న న్యూ యార్క్ లో జరిగే బహిరంగ సభలో పబ్లిక్ ని కలుస్తారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :