మహాత్మాగాంధీకి నివాళులర్పించిన రాహుల్ గాంధీ.. ఆయన బాటలోనే దేశాన్ని ఏకం చేస్తానని ప్రతిజ్ఞ

మహాత్మాగాంధీకి నివాళులర్పించిన రాహుల్ గాంధీ.. ఆయన బాటలోనే దేశాన్ని ఏకం చేస్తానని ప్రతిజ్ఞ

మహాత్మాగాంధీకి  ఆదివారం నాడు గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ  నివాళులర్పించారు. మహాత్ముడు అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారని, అదే బాటలో నడుస్తూ తాము కూడా దేశాన్ని ఏకం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ‘భారత్ జోడో యాత్ర’లో ఉన్న రాహుల్.. కర్ణాటకలోని బందనవోలులో పర్యటిస్తున్నారు. ఇక్కడి ఖాదీ గ్రామోద్యోగ్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన రాహుల్ గాంధీ నివాళులర్పించారు. గతంలో అంటే 1927, 1932లలో మహాత్మా గాంధీ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ ఖాదీ గ్రామోద్యోగ్ ఏర్పాటు చేయడంలో సహకారం అందించారు.

https://twitter.com/i/status/1576397393255616513

 

 

Tags :
ii). Please add in the header part of the home page.