పుతిన్ మరో కీలక నిర్ణయం

రష్యాలో జనాభా గణనీయంగా తగ్గుతోంది. దీంతో ఆందోళన చెందిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జనాభా అభివృద్ధి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. పది మంది అంతకంటే ఎక్కువ పిల్లల్ని కనే మహిలకు 10 లక్షల రష్యన్ రూబుల్స్ (భారత్ కరెన్సీలో సుమారు రూ.13 లక్షలు) నజరానాగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు మదర్ హీరోయిన్ అనే పథకాన్ని ప్రకటించారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు ఒకేసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే దీనికి ఓ మెలిక పెట్టారు. పదో బిడ్డ మొదటి పుట్టిన రోజు నాడు ఈ మొత్తం చెల్లిస్తారట. అప్పటికి మిగిలిన తొమ్మిది మంది పిల్లలూ బతికే ఉండాలని కూడా నిబంధన విధించారు.







Tags :