పుష్ప‌2 ప్లానింగ్ త‌గ్గేదేలా..

పుష్ప‌2 ప్లానింగ్ త‌గ్గేదేలా..

ఏ సినిమా ఏ స్థాయికి వెళ్తుందో ఎవ‌రూ చెప్ప‌లేం. రీసెంట్‌గా రిలీజ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమాల్లో కేజీఎఫ్ ఒక‌టి. ఈ సినిమా సీక్వెల్‌గా వ‌చ్చిన కేజీఎఫ్2 కూడా ఊహ‌కంద‌ని రీతిలో క‌లెక్ష‌న్స్‌ని రాబట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కేజీఎఫ్ త‌ర్వాత ఆ రేంజ్ హిట్ పుష్ప‌. పుష్ప‌2 కోసం డైరెక్ట‌ర్ స్టోరీలో చాలా మార్పులు చేశాడు. బ‌డ్జెట్ ద‌గ్గ‌ర నుంచి అన్నీ విష‌యాల్లో పుష్ప2 స్ట్రాట‌జీనే మారిపోయింది. బ‌డ్జెట్‌ను స‌డెన్‌గా రూ.350 కోట్లకు మార్చేసింది టీమ్. పుష్ప‌1 కంటే ఎక్కువ బ‌డ్జెట్‌ను కేటాయించ‌డంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గా మారాడు. కాక‌పోతే రిలీజ్ విష‌యంలో నిర్మాత‌లు హ‌డావిడిగా ఎలాంటి వ్య‌వ‌హ‌రించి, ఎలాంటి ప్లాన్ లేకుండా రిలీజ్ చేయ‌డంతో ఆశించిన స్థాయి క‌లెక్ష‌న్స్‌ని రాబ‌ట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. పార్ట్2 విష‌యంలో అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని పక్కా ప్లాన్‌తో షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌. 

అక్టోబ‌ర్ 1న ఈ సినిమా షూటింగ్ అల్లు స్టూడియోస్‌లో ప్రారంభం కానుందని, రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ద‌స‌రా అయిపోయాక అక్టోబ‌ర్ 10 నుంచి జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. అంతే కాదు, ఈసారి ముఖ్య‌మైన స‌న్నివేశాల కోసం టీమ్ విదేశాల‌కు కూడా వెళ్ల‌బోతోంద‌ని, ఇప్ప‌టికే సుకుమార్ దానికి సంబంధించిన లొకేష‌న్స్ వెతికాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల్ని చిత్ర బృందం వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.