Radha Spaces ASBL

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ...కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ...కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గతంలో ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్‌ను ఆరు రోజుల పాటు వాయిదా వేసింది. తాజాగా ఈ ఎన్నికలను ఫిబ్రవరి 20న నిర్వహించనున్నట్టు ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం : జనవరి 25న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల. నామినేషన్లకు ఫిబ్రవరి 1 తుది గడువు. నామినేషన్ల పరిశీలనకు తుది గడువు ఫిబ్రవరి 2. నామినేషన్ల ఉపసంహరణకు అఖరి గడువు ఫిబ్రవరి 4. ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 20. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :