ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క్రెడాయ్ ద్వారా అన్నీ జిల్లాల్లో ప్రాపర్టీ షోలు

క్రెడాయ్ ద్వారా అన్నీ జిల్లాల్లో ప్రాపర్టీ షోలు

తెలంగాణలో రియల్‍ ఎస్టేట్‍ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందిస్తున్నదని, త్వరలో అన్నిజిలాల్లో ప్రాపర్టీ షోలను నిర్వహిస్తామని క్రెడాయ్‍ తెలంగాణ చైర్మన్‍ సిహెచ్‍ రామచంద్రారెడ్డి అన్నారు. క్రెడాయ్‍ తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన సందర్భంగా జరిగిన సమావేశంలో క్రెడాయ్‍ తెలంగాణ చైర్మన్‍ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ క్రెడాయ్‍ తెలంగాణ కార్యక్రమాలను, లక్ష్యాలను వివరించారు. ప్రతి ఒకరు సొంత ఇంటి గురించి కలగంటారని, అది నెరవేర్చేందుకు బిల్డర్లు సిద్ధంగా ఉన్నారని  ఇందులో మధ్యతరగతికి అందుబాటు ధరలో ఇల్లు అనేది ఎకువ డిమాండ్‍ కలిగిన అంశమని పేర్కొన్నారు.

క్రెడాయ్‍ తెలంగాణ అధ్యక్షుడు డీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహమ్మారి కారణంగా పలుసవాళ్లు ఎదురైనప్పటికీ రాష్ట్రంలో హైదరాబాద్‍తోపాటు పలు జిల్లాల్లో రియల్‍ ఎస్టేట్‍ రంగంలో విస్తృతస్థాయి డిమాండ్‍ చూస్తున్నామని వివరించారు. హైదరాబాద్‍ నగరంతో పాటుగా ఇతర జిల్లాలైన వరంగల్‍, నిజామాబాద్‍, కరీంనగర్‍లో ఆస్తుల ధరలు బాగా పెరిగాయని క్రెడాయ్‍ తెలంగాణ ఎలక్డ్-అధ్యక్షుడు ఈ ప్రేమ్‍సాగర్‍రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్‍, ఆటో, ఫార్మా, హెల్త్కేర్‍, ఐటీ, ఐటీఈఎస్‍, ఏవియేషన్‍, ఫుడ్‍ ప్రాసెసింగ్‍ మొదలైనవాటిలో పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షిస్తున్నదని క్రెడాయ్‍ తెలంగాణ సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి అన్నారు.

క్రెడాయ్‍ తెలంగాణ నూతన కార్యవర్గం

క్రెడాయ్‍ తెలంగాణ చైర్మన్‍ సీహెచ్‍ రామచంద్రారెడ్డి, ప్రెసిడెంట్‍ డీ మురళీకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్‍-ఎలక్ట్ ఈ ప్రేమసాగరెడ్డి, సెక్రటరీ కే ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులు జీ అజయ్‍కుమార్‍, జగన్‍మోహన్‍ చిన్నాల, వీ మధుసూదన్‍రెడ్డి, బీ పాండురంగారెడ్డి, జాయింట్‍ సెక్రటరీ జీ శ్రీనివాస్‍గౌడ్‍, ట్రెజరర్‍ ఎం ప్రశాంతరావు, క్రెడాయ్‍ యూత్‍ వింగ్‍ తెలంగాణ కో ఆర్డినేటర్‍ సంకీర్త్ ఆదిత్యరెడ్డి, సెక్రటరీ రోమిత్‍ అశ్రిత్‍తో కొత్త కార్యవర్గం ఏర్పాటైంది.  2021 నుంచి 2023వ సంవత్సరం వరకు ఈ కార్యవర్గం కొనసాగుతుంది

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :