ASBL NSL Infratech
facebook whatsapp X

ఫిష్ వెంకట్ కి ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయలు అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు 

ఫిష్ వెంకట్ కి ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయలు అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు 

తెలుగు సినిమాలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించిన ఫిష్ వెంకట్. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల తనకు కలిగిన ఆర్థిక ఇబ్బందిని తెలుసుకుని వైద్య, ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయలు అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు. చదలవాడ శ్రీనివాసరావు గారి తరఫున ఫిష్ వెంకట్ కు చెక్కును అందించిన టి ఎఫ్ పి సి ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ గారు, టి ఎఫ్ పి సి సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, దర్శకుడు కె. అజయ్ కుమార్ గారు,తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు.

ఈ సందర్భంగా టి ఎఫ్ పి సి ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ : మా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎక్కడో వీడియోలో ఫిష్ వెంకట్ గారు పడుతున్న ఇబ్బంది చూసి ఆర్థిక సహాయార్థం లక్ష రూపాయలు అందించారు. అడిగితేనే సహాయం చేయలేని ఈ రోజుల్లో అడక్కుండానే సహాయం చేసే ఆయన్ని దేవుడు గా మహానీయుడుగా భావించవచ్చు. అడగకుండానే కష్టం తెలుసుకొని ఇంతటి సహాయం చేసిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్నారు.

దర్శకుడు కె. అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ : రాత్రి న్యూస్ ఛానల్ లో వేసిన ఒక వీడియోలో ఫిష్ వెంకట్ గురించి చూసి తెలుసుకుని చదలవాడ శ్రీనివాసరావు గారు లక్ష రూపాయలు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఆయన సినిమాల్లో నటించిన నటించకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఫిష్ వెంకట్ గారు నటన తో ఎన్నో మంచి పాత్రలో నటించారు కాబట్టి ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని చదలవాడ శ్రీనివాసరావు గారు సహాయాన్ని అందించారు. ఫిష్ వెంకట్ గారి తరఫున చదలవాడ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

టి ఎఫ్ పి సి సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ :  నిజానికి ఫిష్ వెంకట్ గారు సహాయం అడగకుండానే ఆయన పడుతున్న ఇబ్బంది తెలుసుకొని చదలవాడ శ్రీనివాసరావు గారు మా ద్వారా లక్ష రూపాయల చెక్కును అందించమని కోరడం జరిగింది. గతంలో కూడా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. కోవిడ్ టైంలో ఇండస్ట్రీలో ఎంతోమంది వర్కర్స్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. చిత్రపురి కాలనీ ద్వారా ఎంతో మంది వర్కర్స్ అక్కడ నివసించడానికి ఆయన వంతు సహాయం అందించి ఎంతో మంది జీవితాలని నిలబెట్టారు. అదేవిధంగా ముందు ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని చల్లగా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు మాట్లాడుతూ : అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు. కానీ అడగకుండానే సాయం చేసే మంచి వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు గారు. ఫిష్ వెంకట్ గారి కష్టాన్ని టీవీలో చూసి తెలుసుకుని ఆయనకు సహాయంగా లక్ష రూపాయలు అందించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఎంతోమంది ఎంప్లాయిస్ కి అండగా నిలబడ్డారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఇంకా ముందు ముందు ఆయన ఇలాగే ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఫిష్ వెంకట్ గారు మాట్లాడుతూ : నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే లక్ష రూపాయలు సహాయం అందించిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసిన ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేను నా కుటుంబం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇలాగే ఆయన ఇంకా ఎంతో మందికి సేవ చేసే విధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఆయన పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :