Radha Spaces ASBL

మాణిక్యం ఠాగూర్ స్థానంలో... ప్రియాంక గాంధీకి ఛాన్స్!

మాణిక్యం ఠాగూర్ స్థానంలో... ప్రియాంక గాంధీకి ఛాన్స్!

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ను త్వరలోనే మార్చే ఆలోచనలో ఏఐసీసీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికకు ముందే మాణిక్యం ఠాగూర్‌ స్థానంలో ప్రియాక గాంధీ వచ్చే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. వారం రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఠాగూర్‌ ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, రేవంత్‌ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారనే వాదనలు చాలా రోజలుగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే అధిష్ఠానం ఇంచార్జి మార్పు అనివార్యంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :