ఆప్త వేడుకల్లో పృధ్వీకి ‘హాస్య నట కేసరి’ బిరుదు
అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) 16వ వార్షికోత్సవం ఇటీవల వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లోజరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముగింపు రోజున శ్రీనివాస కళ్యాణమ, ఫ్యాషన్ షో, కోటి సంగీత విభావరి వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ‘‘అప్త’’కు సేవలకు గానూ కోట సుబ్బును ఘనంగా సత్కరించారు. నటుడు పృధ్వీకి ‘‘హాస్య నట కేసరి’’ బిరుదును అందజేశారు. బిజినెస్, మాట్రిమోనియల్ సదస్సులో పలువురు పాల్గొన్నారు. వేడుకల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కన్వీనర్ దంగేటి కిషోర్ ధన్యవాదాలు తెలిపారు. బ్యాంక్వెట్ విందులో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, డా.ఉదయశంకర్, డా. చక్రరావు, సంగీత దర్శకుడు కోటి, నటుడు పృథ్వీరాజ్, బండి శివశంకర్ రణధీర్, ఆలివ్ స్వీట్స్ దొరరాజు తదితరులను ఆప్త పురస్కారాలతో సత్కరించారు. వేడుకల విజయవంతానికి కార్యదర్శి పద్యాల గోపీచంద్, సంస్థ అధ్యక్షుడు ముద్రగెడ త్రినాథ్, ఆప్త కార్యదర్శి నరహరిశెట్టి హిమబిందు, బోర్డ్ ఛైర్మన్ సీరం సూర్యనారాయణ తదితరులు కృషి చేశారు.