సమతామూర్తిని దర్శించుకున్న రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆమెతో పాటు గవర్నర్ తమిళి సై, మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. స్ఫూర్తి కేంద్రంలోని 3వ నవంబర్ గేట్ వద్ద త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రామ నగరంలోని 108 అడుగుల శ్రీరామానుజచార్య విగ్రహాన్ని, రామానుజుని స్వర్ణ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శాసనాలు ఇచ్చారు. స్వర్ణ రామానుజన్ విగ్రహం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం 108 ఉపాలయాలను రాష్ట్రపతి ముర్ము సందర్శించారు. ఉపాలయాల విశిష్టతను చినజీయర్ స్వామి ఆమెకు వివరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన డైనమిక్ ఫౌంటేయిన్ షో, స్టాచ్యూ ఆప్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షోలను రాష్ట్రపతి తిలకించారు. సందర్శన అనంతరం ముచ్చింతల్ నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారం బయలుదేరారు.