ప్రమోషనల్ మెటీరియల్‌గా మారిన మోక్షజ్ఞ
నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 6న దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ రానుంది. షూటింగ్ ప్రారంభోత్సవరం ఉండకపోవచ్చు కానీ అనౌన్స్‌మెంట్ తో పాటూ చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్.
సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నా ఈ పాన్ ఇండియా సినిమాకు బడ్జెట్ కూడా భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డిజైన్ చేసుకున్న సినిమాటిక్ యూనివర్స్ కు ఇప్పుడు మోక్షజ్ఞ చాలా పెద్ద ప్రమోషనల్ మెటీరియల్ కానున్నాడు. ప్రశాంత్ వర్మ తీసిన జాంబీ రెడ్డి, హను మాన్ సినిమాలు హిట్ అయినప్పటికీ వాటి హీర తేజ సజ్జ చాలా చిన్న వాడు. బ్యాక్ గ్రౌండ్, ఫ్యాన్స్ మద్దతు లేని వాడు.
కానీ మోక్షజ్ఞ అలా కాదు. బాలయ్య ఫ్యాన్స్ తో పాటూ నందమూరి అభిమానులు మొత్తం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. దానికి తోడు గతేడాది టైమ్ లో మోక్షజ్ఞ చేసిన మేకోవర్ కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాకు గాండీవ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఫోకస్ మొత్తం ఈ సినిమాపైనే ఉందని, ఈ సినిమా పూర్తయ్యాకే జై హనుమాన్ ను టేకప్ చేస్తాడని అంటున్నారు.