ASBL Koncept Ambience
facebook whatsapp X

రూటు మార్చ‌నున్న నీల్?

రూటు మార్చ‌నున్న నీల్?

ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ల‌లో ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్(Prasanth Neel) కూడా ఒక‌డు. ఆయ‌న తీసింది నాలుగు సినిమాలే అయినప్ప‌టికీ వాటితో చాలా పెద్ద రేంజ్ కు వెళ్లాడు నీల్. మొద‌టి సినిమా ఉగ్రం(Ugram) గురించి ఆడియ‌న్స్ కు పెద్ద‌గా తెలియదు కానీ మిగిలిన మూడు సినిమాల గురించి అంద‌రికీ తెలుసు. ఆయ‌న సినిమాలన్నీ బ్లాక్ థీమ్ తోనే సాగాయి.

పోస్ట‌ర్ల నుంచి సినిమా వ‌ర‌కు మొత్తం బొగ్గు పులిమిన‌ట్లు అనిపిస్తాయి. కేజీఎఫ్1(KGF1) చూసిన‌ప్పుడు ఆ థీమ్ కొత్త‌గానే ఉంది కానీ త‌ర్వాత మాత్రం ఆడియ‌న్స్ కు ఆ థీమ్ చాలా ఇబ్బంది క‌లిగించింది. బ్లాక్ థీమ్ ఓవ‌ర్ డోస్ అయిపోయిన ఫీలింగొచ్చింది. ప్ర‌శాంత్ సినిమాల్లో హీరోల ఎలివేష‌న్ల నుంచి యాక్ష‌న్ సీన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి.

దీంతో నీల్ సినిమాల‌న్నీ ఒకేలా ఉంటాయ‌నే ఫీలింగ్ ఆడియ‌న్స్ కు వ‌స్తుంది. అందుకే నీల్ త‌ను ఎన్టీఆర్ తో చేయ‌బోతున్న త‌ర్వాతి సినిమాకు వైవిధ్యం చూపించాల‌నుకుంటున్నాడట‌. క‌థా నేప‌థ్యాన్ని, విజువ‌ల్స్ ను మార్చ‌డంతో పాటూ బ్లాక్ థీమ్ ను ప‌క్క‌న పెడుతున్నట్లు తెలుస్తోంది. త‌నను తాను కొత్త‌గా నిరూపించుకోవ‌డానికి నీల్, ఎన్టీఆర్(NTR) సినిమాతో ఈ ప్ర‌యోగం చేయ‌నున్నాడ‌ట‌. న‌వంబ‌ర్ నెలాఖ‌రు నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.  

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :