టాలీవుడ్ హీరోలపైనే నీల్ ఫోకస్
రిలీజ్ ముందు వరకు తనెవరో అసలు ఎవరికీ తెలియను కూడా తెలియదు. అలాంటిది ఒక్కసారిగా కేజీఎఫ్ రిలీజయ్యాక ప్రశాంత్ నీల్ రేంజ్ మారిపోయింది. మొదటి సినిమాతోనే ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న ప్రశాంత్ నీల్, కన్నడ ఇండస్ట్రీకి మొదటి వెయ్యి కోట్ల సినిమాను అందించి రికార్డు సృష్టించాడు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ నీల్ ను కన్నడ సినిమాలకు పరిమితమై, తమ ఇండస్ట్రీ మార్కెట్‌ను పెంచాలని అక్కడి మూవీ లవర్స్ గోల చేస్తున్నా, నీల్ ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే ఉన్నట్లు కనిపిస్తోంది.
దానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్, దాని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కోసం ఎంత లేదన్నా సంవత్సరానికి పైగానే టైమ్ అవసరమవుతుంది. ఈ లోపు ప్రభాస్ తో సలార్2 రెడీ చేయాలి. ఇప్పటివరకు సలార్ సీక్వెల్ గురించి అనౌన్స్ చేయకపోయినా సీక్వెల్ ఉంటుందని ఇన్‌సైడ్ టాక్.
తర్వాత రామ్ చరణ్,డీవీవీ దానయ్య తో సినిమా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యే సరికి దాదాపు మూడేళ్లు పడుతుంది. ఈ లోపు కొత్త కమిట్‌మెంట్స్ వచ్చేస్తాయి. పైగా నీల్ బన్నీ, మహేష్ లతో సినిమాలు చేయాలని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. నీల్ అడిగితే వాళ్లు డేట్స్ ఇవ్వకుండా ఉండరు. ఎలా చూసుకున్నా సరే నీల్ మరో పదేళ్లు టాలీవుడ్ హీరోలతోనే బిజీగా ఉంటాడని తన లైనప్‌ను చూసి చెప్పొచ్చు.