ఇంకనైనా ప్రజల కోసం పని చేయండి.. పవన్ పై ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు..
తిరుపతి లడ్డు (Tirupati Laddu) కల్తీ విషయం ప్రస్తుతం ఏ రేంజ్ దుమారాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో అందరికంటే ఎక్కువ హైలైట్ అయిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) . స్వామివారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా దీక్షను చేపట్టడంతో పాటు.. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమంటూ పవన్ చేసిన హాట్ కామెంట్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు.
తాజాగా ఈ విషయంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆధారాలు అడగడంతో మొత్తం సీన్ రివర్స్ అయింది. నిన్నటి వరకు సనాతన ధర్మం గురించి పవన్ ( Pawan Kalyan) మాట్లాడిన వీడియోలను వైరల్ చేసిన నెటిజన్లు.. ఇప్పుడు ఆయనపై ఓ రకంగా మండిపడుతున్నారు. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వదలరా అంటూ వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారు.ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ కు.. ప్రకాష్ రాజ్ (Prakash Raj) కు మధ్య జరిగిన వాదోపవాదాలు అందరికీ తెలిసిందే. షూటింగ్ పూర్తిచేసుకుని వచ్చే సమాధానం ఇస్తానన్న ప్రకాష్ రాజ్ తిరిగి మరొకసారి పవన్ పై తన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
‘కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువగా ఉంటాయి కదా? ఇంతవరకు చేసింది చాలు ఇకనైనా ప్రజల కోసం చేయాల్సిన పనులను చూడండి..’హంటు ప్రకాష్ రాజ్ పవన్ పై వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ కి కొంత మంది పవన్ కు మద్దతుగా నిలుస్తుంటే చాలామంది ప్రకాష్ రాజ్ కి మద్దతు పలుకుతున్నారు. ఇక ఈ పోస్ట్ కి పవన్ ఏ రిప్లై ఇస్తారో చూడాలి. దీనిపై పవన్ స్పందిస్తారా.. నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పవన్ చాలా వరకు సైలెంట్ అయినట్టు కనిపిస్తోంది. అయితే ఈ మౌనం వెనుక కారణం మాత్రం తెలియదు..