ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్ర‌భాస్ కు అంత ఖాళీ ఎక్క‌డుంది?

ప్ర‌భాస్ కు అంత ఖాళీ ఎక్క‌డుంది?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) ప్ర‌స్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. ప్ర‌భాస్ చేస్తున్న ప్ర‌తీ సినిమా భారీ స్థాయిలో రూపొందుతుందే. ఏడు నెల‌ల గ్యాప్ లోనే ప్ర‌భాస్ నుంచి స‌లార్(Salaar), క‌ల్కి(Kalki) సినిమాల‌ను రిలీజ్ చేశాడంటే అత‌నెంత బిజీగా ఉంటున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రో 5 నెల‌ల్లో రాజా సాబ్(The Raja Saab) సినిమా రిలీజ్ కానుంది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాజా సాబ్ తో పాటూ హ‌ను రాఘ‌వ‌పూడి(Hanu Raghavapudi) ద‌ర్శ‌క‌త్వంలో ఫౌజి(Fauji) చిత్రం చేస్తున్నాడు. ప్ర‌భాస్ లాంటి పెద్ద స్థాయి హీరో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొన‌డమంటే మాట‌లు కాదు. అయితే ఇప్పుడు మ‌రో సినిమా కూడా ఈ లిస్ట్ లోకి చేర‌నున్న‌ట్లు స‌మాచారం. అదే స్పిరిట్(Spirit). అర్జున్ రెడ్డి(Arjun Reddy),యానిమ‌ల్(Animal) సినిమాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

వీరిద్ద‌రి కాంబోలో సినిమా అన‌గానే అంద‌రూ పిచ్చోళ్లైపోయారు. స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ల‌డానికి చాలానే టైమ్ ప‌డుతుంద‌నుకున్నారు. కానీ ఈ సినిమా డిసెంబ‌ర్ లోనే షూటింగ్ కు వెళ్ల‌నుంద‌నే స‌మాచారం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నిర్మాత భూష‌ణ్ కుమార్(bhushan Kumar) తెలిపాడు. అయితే ఓ ప‌క్క రాజా సాబ్, మ‌రోప‌క్క ఫైజీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌కు స్పిరిట్ షూటింగ్ లో పాల్గొనేంత టైమ్ ఎక్క‌డుంద‌నేది అంద‌రికీ క‌లుగుతున్న అనుమానం. పైగా మూడు సినిమాల‌కూ ప్ర‌భాస్ డిఫ‌రెంట్ లుక్స్ మెయిన్‌టెయిన్ చేయాల్సి ఉంది. బ‌హుశా ముందు వేరే న‌టీన‌టుల‌తో షూటింగ్ మొద‌లుపెట్టి ఆ త‌ర్వాత కాస్త లేట్ గా ప్ర‌భాస్ స్పిరిట్ సెట్స్ లో జాయిన్ అవుతాడేమో చూడాలి.  

 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :