ప్రభాస్- హను సినిమా బడ్జెట్ ఎంతంటే?
ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్న ప్రభాస్ చేతిలో కల్కి, మారుతి తో చేస్తున్న సినిమాలున్నాయి. వీటి తర్వాత ప్రభాస్ హను రాఘవపూడితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే ప్రచారమవుతుంది. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో రానున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మైత్రీ నిర్మాతలు ప్రభాస్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మరోవైపు సీతారామం బ్లాక్ బస్టర్ తర్వాత కూడా మైత్రీ వాళ్లు హను రాఘవపూడికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఈ కాంబోలో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయాలని నిర్మాతలు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ లో ఈ సినిమాపై క్లారిటీ వచ్చే ఛాన్సుంది. ప్రస్తుతం హను ఈ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా హను నిర్మాతలతో మాట్లాడిన దాన్ని బట్టి బడ్జెట్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రభాస్-హను కాంబోలో రానున్న లవ్ స్టోరీకు సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ వరకు ఖర్చు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.