బాలీవుడ్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్?
ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అంటే వెంటనే వచ్చే ఆన్సర్ ప్రభాస్. సలార్, కల్కి సినిమాలు ప్రభాస్ బాక్సాఫీస్ సత్తాను చాటాయి. ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్రభాస్ ఓ సినిమాలో చిన్న క్యామియో చేసినా ఆ సినిమా బిజినెస్ మారిపోయేలా ఉంది. మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా ఈ విధంగానే క్రేజ్ ను పెంచుకుంది.
ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ప్రభాస్ క్యామియోతో ఓ సినిమా హైప్ ను పెంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో త్వరలోనే సింగమ్ అగైన్ అనే సినిమా రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రోమోను రోహిత్ శెట్టి రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో కల్కి బీజీఎం వినిపిస్తోంది.
గాల్లోంచి ఎగురుతూ కిందికి దిగిన వీడియోలో ఈ హీరో లేకుండా సింగమ్ అసంపూర్ణంగా ఉంటుంది. ఇందులో హీరో ఉన్నాడు. దీపావళికి అందులోంచి దిగుతాడు అని రోహిత్ శెట్టి ఆ వీడియోను షేర్ చేస్తూ రాసుకొచ్చాడు. కల్కి బీజీఎం ఉందంటే ఆ వెహికల్ లో ఉంది కచ్ఛితంగా ప్రభాసేనని, ఈ సినిమాలో ప్రభాస్ క్యామియో చేస్తున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.