ఆధునిక హంగులతో నిర్మితమవుతున్న పౌలోమీ అవాంతే

ఆధునిక హంగులతో నిర్మితమవుతున్న పౌలోమీ అవాంతే

రియల్‌ ఎస్టేట్‌ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ల అభివృద్ధిలో పేరుగాంచిన పౌలోమి సంస్థ నిర్మించే ప్రాజెక్టులకు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సమీకృత ఇంజనీరింగ్‌, సేకరణ మరియు నిర్మాణ సేవలు, మౌలిక సదుపాయాలను అందించడంలో ఈ సంస్థ అగ్రగామిగా ఉంది. వినోద ఉద్యానవనాలు, రోడ్లు, భవనాల నిర్మాణంలో ఉన్న అనుభవం మరియు నైపుణ్యం వల్ల ఇతర రంగాల్లో కూడా ఈ సంస్థ ప్రత్యేకతను చాటుకుంది.   తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పౌలోమి ప్రాజెక్టులు కనిపిస్తాయి. ప్రాజెక్ట్‌లను అత్యుత్తమంగా నిర్మించడంతోపాటు వాటిని సకాలంలో పూర్తి చేయడంలో సంస్థ విజయాన్ని అందుకుంది. ఐఎస్‌ఓ, ఓహెచ్‌ఎస్‌ఎఎస్‌ సర్టిఫికెట్‌లను కూడా అందుకుంది. నిపుణులైన సిబ్బంది, సుశిక్షితులైన వర్కర్లు ఈ సంస్థలో ఉన్నందువల్ల ప్రతి ప్రాజెక్టు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంటాయి.

కోకాపేటలో ప్రాజెక్టు

హైదరాబాద్‌లో మంచి డిమాండ్‌ ఉన్న ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, గచ్చిబౌలి ఐటీ హబ్‌కు సమీపంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేటలో పౌలోమీ ఎస్టేట్స్‌ చకచకా నిర్మిస్తున్న ప్రాజెక్టే.. పౌలోమీ అవాంతే. సుమారు 4.75 ఎకరాల స్థలంలో 3 బ్లాకుల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య 475 ఫ్లాట్లు. రెండు సెల్లార్లు, గ్రౌండ్‌, 22 అంతస్తుల్లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 1555 నుంచి 2575 చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో త్రీ బీహెచ్‌ కే అపార్టుమెంట్లు ఇందులో లభిస్తాయి. వాస్తు సూత్రాలకు అనుగుణంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 452 త్రీ బీహెచ్‌కే ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ప్రాజెకు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా కస్టమర్లకు నచ్చే విధంగా నిర్మాణాలను తీర్చిదిద్దుతున్నారు.  ప్రాజెక్టు చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు.

సకల సదుపాయాలతో 28 వేల చదరపు అడుగుల్లో  క్లబ్‌ హౌస్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. మల్టీపర్పస్‌ హాల్‌, ఇండోర్‌ జిమ్‌ మరియు ఔట్‌ డోర్‌ జిమ్‌, రెండు చిల్డ్రన్స్‌ ప్లే ఏరియాలు, క్రికెట్‌ పిచ్‌, బాస్కెట్‌ బాల్‌ హాఫ్‌ కోర్టు, 2250 చదరపు అడుగుల బ్యాడ్మింటన్‌ కోర్టు, ఫుట్‌సోల్‌ కోర్టు, స్విమ్మింగ్‌ పూల్‌, జాగింగ్‌ ట్రాక్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. సూపర్‌ మార్కెట్‌, క్రెష్‌, యోగా హాల్‌, స్పా, బిలియర్డ్స్‌ రూమ్‌, గెస్ట్‌ రూములు, ఇండోర్‌ గేమ్స్‌, టెర్రస్‌ పూల్‌, కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు గల డెక్‌ ఏరియా వంటివి ఈ ప్రాజెక్టులో కనిపిస్తాయి.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలకోసం ప్రాజెక్టు వెబ్‌ సైట్‌ను చూడండి.

www.poulomi.in/residential/avante

Poulomi Estates Pvt. Ltd.
6-3-865/D/21, 5th Floor, Madupala Towers, Greenlands,
Begumpet, Hyderabad, Telangana - 500016
+917070704444. sales@poulomi.in

 

 

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :