Radha Spaces ASBL

ఇంటికొచ్చింది.. ఓటు

ఇంటికొచ్చింది.. ఓటు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేక కేటగిరీ ఓటర్లు తమ ఇళ్ల నుంచే ఓటుహక్కును వినియోగించుకునే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం లింగరాజుపల్లిలో స్థానికుడైన మర్కంటి పెదరాజయ్య(85)తో అధికారులు పోస్టల్‌ ఓటు వేయించారు. ఈ మండలంలో 28 మంది వృద్ధులు, దివ్యాంగులు ఇలా ఓటేసేందుకు పేర్లను నమోదు చేయించుకోగా 21 మందితో ఓట్లు వేయించారు. ఈ ప్రక్రియను  ప్రతి నియోజకవర్గంలో మూడు రోజుల చొప్పున నిర్వహిస్తూ, ఈ నెల 29లోపు పూర్తి చేస్తారు.  తెలంగాణలో ఇంటి  నుంచి ఓటేయడానికి తమ పేర్లను దరఖాస్తు చేసుకున్న వారిలో 80 ఏళ్ల వయసు దాటినవారు, దివ్యాంగులు, జర్నలిస్టులు తదితర 13 వర్గాలకు చెందిన 28,057 మంది ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :