ASBL Koncept Ambience
facebook whatsapp X

కొత్త జాన‌ర్ లో బుట్ట బొమ్మ‌?

కొత్త జాన‌ర్ లో బుట్ట బొమ్మ‌?

ఒకే క‌థ‌ను కొంచెం అటు ఇటు మార్చి తీస్తాడ‌ని కాంచ‌న ఫ్రాంచైజ్ మీద కామెంట్స్ ఉన్న‌ప్ప‌టికీ ఆ సిరీస్‌కు ఉన్న క‌మ‌ర్షియ‌ల్ వాల్యూ చాలా పెద్ద‌ది. మునితో ఈ ప‌రంప‌ర‌ను మొద‌లుపెట్టిన లారెన్స్ ని త‌ర్వాత ఎంద‌రో డైరెక్ట‌ర్లు ఫాలో అయి సూప‌ర్ హిట్లు అందుకున్నారు. ఇప్పటికే మూడు భాగాలు రిలీజ్ కాగా ఇప్పుడు కాంచ‌న 4కి రంగం సిద్ధ‌మ‌వుతుంది.

బాలీవుడ్ నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్స్ ఈ సినిమాను రూ.100 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టేందుకు రెడీ అయింద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ దశ‌లో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని దాదాపు తీసుకున్నట్టేన‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టిర‌వ‌ర‌కు పూజా హార‌ర్ జాన‌ర్ లో న‌టించింది లేదు.

రెండేళ్‌ల కింద‌ట తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస డిజాస్ట‌ర్లు రావ‌డంతో బాలీవుడ్ లో ల‌క్ ను ప‌రీక్షించుకోవాల‌ని వెళ్లింది. అక్క‌డ స‌ల్మాన్ తో క‌లిసి చేసిన కిసీకా భాయ్ కిసీకాజాన్ కూడా దారుణ‌మైన ఫ్లాపుగా మిగిలింది. ప్ర‌స్తుతం షాహిద్ క‌పూర్ తో దేవా, త‌మిళంలో సూర్య‌తో ఓ సినిమా చేస్తున్న పూజా ఇప్పుడు లారెన్స్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే కచ్ఛితంగా కొత్త రూట్ తీసుకున్న‌ట్టే. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :