MKOne Telugu Times Business Excellence Awards

విపక్షాలపై సర్జికల్ స్ట్రైక్..?

విపక్షాలపై సర్జికల్ స్ట్రైక్..?

వరుసగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరీ ముఖ్యంగా చత్తీస్ ఘర్, రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం సమీపించింది. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ సంధించారా? విపక్షాలను ఆర్థికంగా బలహీనం చేయడమే లక్ష్యంగా ఈ పాచిక విసిరారా? విపక్షనేతల ప్రకటనలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది

ఎన్నికలు పూర్తిగా డబ్బు మయం. ప్రతీ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో గెలవాలంటూ వేలకోట్లు కుమ్మరించాలి.ఇప్పటికే విపక్షాలు అధికారంలో ఉన్నచోట.. సాదారణంగానే అవి మనీ సిద్ధం చేసుకుంటున్నాయి. పెద్దనోట్లు అయితే ఎక్కువ మొత్తం స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడీ నోట్ల రద్దు వాటికి ఇబ్బందికరమేనని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ముందు..  అన్నివ్యవస్థలు మోకరిల్లుతాయి. వారికి కావాల్సిన విధంగా అన్ని సర్దుబాట్లు జరిగిపోతాయి, కాదంటే బడా వ్యాపారవేత్తలు మనీ సర్దేందుకు సిద్దంగా ఉంటారు. విపక్షాలకు అలా కాదు కదా..

రాజస్థాన్, చత్తీస్ ఘర్  రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ కాంగ్రెస్ కు గెహ్లోత్ రూపంలో గట్టి సీఎం ఉన్నారు. బీజేపీ ఎన్ని ఎత్తులేసిన పార్టీ చీలకుండా జాగ్రత్తలు పడుతూ పాలన సాగిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఆయనకు గట్టి అడ్డంకులే ఉన్నాయి. ఓవైపు వసుంధరా రాజేతో తలపడాల్సి ఉండగా.. మరోవైపు నోట్ల రద్దు కావడంతో మనీ  సమస్య కూడా ఎదురు కానుంది. చత్తీస్ ఘర్ లోనూ భూపేష్ బగేల్ కు ఇదే పరిస్థితి ఎదురు కానుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇతర విపక్ష సీఎంలకు నిధుల కొరత ఇబ్బంది పెట్టనుంది.

మరోవైపు.. ఇదే సమయంలో కేంద్రం అండతో బీజేపీ పాలిత సీఎంలు... నిధుల కొరత సమస్యను సాఫీగా ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో ఇది ఎన్నికల సమయంలో వేసిన మరో సర్జికల్ స్ట్రైక్ గా కొందరు రాజనీతిజ్ఞులు అభివర్ణిస్తున్నారు. దీన్ని ఆపార్టీలు ఎంత సమర్థంగా ఎదుర్కొంటాయన్నదానిపైనే వాటి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పార్టీల్లోనూ అంతర్గతంగా ఇదే ఆందోళన కనిపిస్తోంది.

 

 

Tags :