బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం ప్రాంతానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్రన్ ప్రధాన్, ఇతర అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధాని మోదీకి వివరించారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోదీ భేటీ అయ్యారు. రైలు ప్రమాద బాధితులను ప్రధాని పరామర్శించారు. కట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షత గ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.







Tags :