అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను కలిసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సులో బైడెన్‌తో సమావేశమైనట్లు గోయల్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిని కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అని మంత్రి తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ గురించి పలు అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ ప్రస్తావించిన అంశాలతో అంగీకరిస్తున్నట్లు బైడెన్ తనతో చెప్పారని పీయూష్ గోయల్ తెలిపారు.







Tags :