బ్రో ను తనే కాపాడాలి

రాజకీయాల్లో మునిగిపోయి, పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పిన మాటలకు ఫ్యాన్సంతా ఎంతో ఢీలా పడ్డారు. కొన్నాళ్లు పవన్ చెప్పినట్లు సినిమాలకు దూరంగా ఉన్నారు కూడా. తర్వాత తన మనసు మార్చుకుని తిరిగి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. కానీ పవన్ రీఎంట్రీ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలన్నీ రీమేక్‌లే.
దీంతో ఫ్యాన్స్‌కు తమ అభిమాన హీరో ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూడలేకపోతున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండూ ఫ్యాన్స్ కు నచ్చకుండా పవన్ సెలెక్ట చేసుకున్న సినిమాలే. కానీ తర్వాత రిజల్ట్ తో శాటిస్‌ఫై అయ్యారు. ఇప్పుడు పవన్ మళ్లీ రీమేక్ చేస్తున్నాడు. అదే బ్రో. ఈ సినిమ తమిళ హిట్ వినోదాయ సీతం కు రీమేక్ అన్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా ఒరిజినల్ ను చూసిన వాళ్లంతా ఇలాంటి సినిమా తెలుగులో వర్కవుట్ అవుతుందా అని కొందరంటుంటే, సాయి తేజ్- పవన్ కాంబోలో సినిమా ఏంటని మరికొందరు అంటున్నారు. ఈ సినిమా ఆల్రెడీ హిందీలో కూడా రీమేక్ అయింది కానీ బాలీవుడ్ లో సినిమా పెద్దగా ఆడలేదు. అది తెలిసి కూడా పవన్ ఎలా ధైర్యం చేశాడనేది ఇప్పుడు అందరిని వెంటాడుతున్న ప్రశ్న.
గోపాల గోపాల సినిమాలో పవన్ క్యారెక్టర్ లా ఈ క్యారెక్టర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ ఏమీ ఆ సినిమాలో ఉండదని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఈ సినిమాను త్రివిక్రమ్ టచ్‌యే కాపాడాలని అందరూ కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, వినోదం తోడైతే ఈ సినిమా రూపురేఖలు మారిపోవడం ఖాయం. త్రివిక్రమ్ ఈ క్యారెక్టర్ ను చాలా బాగా డెవలప్ చేశాడని టాక్. మరి పవన్ బ్రో ఫ్యాన్స్ ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.