తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్
ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. అనంతరం అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు. పవన్ కల్యాణ్ దీక్ష విరమణ నేపథ్యంలో 30న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు. అక్టోబర్ 1న ఓం నమో నారాయణా అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో పఠించాలని పార్టీ శ్రేణులకు జనసేన అధిష్ఠానం సూచించింది. 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చింది.
Tags :