ఈ ఘటన దురదృష్టకరం... వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బోట్ల యజమానులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టిన భద్రతాపరమైన అంశాలపై సమీక్షించాలని కోరారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగి 40కి పైగా బోట్లు ధగ్గమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.







Tags :