హరీష్ కు పవన్ డెడ్‌లైన్?
త కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Powerstar Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల అతని మూవీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే పవన్(Pawan) గతంలో లైన్ లో పెట్టిన మూడు ప్రాజెక్టులను ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు(Harihara VeeraMallu) షూటింగ్ లో పవన్ జాయిన్ అయ్యాడు.
అసలు విషయానికొస్తే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్(Gabbar Singh) తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మొదటినుంచే భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ మొదలై మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత పవన్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. అప్పట్నుంచి ఈ సినిమా ఉంటుందా ఉండదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఉస్తాద్ భగత్‌సింగ్‌ను త్వరలోనే మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నాడట. అందుకే డైరెక్టర్ హరీష్ శంకర్ తో డిస్కస్ చేసి నవంబర్ చివరికి డైలాగ్ వెర్షన్ తో కూడిన ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేయాలని డెడ్ లైన్ పెట్టాడట. తాను చెప్పినట్లు చేస్తే వెంటనే బల్క్ లో డేట్స్ ఇచ్చి సినిమాను రీస్టార్ట్ చేస్తానని కూడా పవన్ చెప్పాడట. దీంతో హరీష్ తన టీమ్ తో ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేయించే పనిలో బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ తేరీ(Theri)కి రీమేక్ గా తెరకెక్కుతుంది.