MKOne Telugu Times Business Excellence Awards

ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ : పట్టాభి

ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ : పట్టాభి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో  అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్టుకు సుప్రీంకోర్టులో లైన్‌ క్లియర్‌ అయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ అన్నారు. ఈ సందర్భంగా పట్టాభి మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో ఉన్న అవినాష్‌ రెడ్డి తనను అరెస్టు  చేయనీకుండా ప్రైవేటు సైన్యాన్ని మోహరించి సీబీఐని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.  ఈ విషయంలో కేంద్ర హోంశాఖ స్పందించి వెంటనే కర్నూలుకు బలగాలను  పంపించాలని కోరారు. అవినాష్‌ రెడ్డి తల్లి ప్రాణాలకూ ముప్పు పొంచి ఉందని ఆమెను ఎందుకని హైదరాబాద్‌ లేదా బెంగళూరుకు తరలించడం లేదని  ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్‌ డైరెక్షన్‌లోనే అవినాష్‌ను అరెస్టు చేయనీయకుండా ప్రైవేటు సైన్యం అడ్డుకుంటోందని విమర్శించారు. 

 

 

Tags :