ఫాక్స్కాన్ ఉద్యోగులకు షాక్.. 20 వేల మంది ఔట్!

ఫాక్స్కాన్ ఉద్యోగులకు  షాక్..  20 వేల మంది ఔట్!

చైనాలోని జెంగ్‌జౌలో ఫాక్స్‌కాన్‌ కంపెనీ నుంచి 20 వేల మంది పైగా వైదొలిగారు. దాదాపు వీరంత ప్రొడక్షన్‌ లైన్‌లో ఇంకా పనులు చేయని వారే. టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఐ`ఫోన్‌ తయారీ దారు ఫాక్స్‌కాన్‌ భారీ స్థాయిలో ఉద్యోగులు వైదొలగడంతో ఈ నెలాఖరు కల్లా పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపట్టాలన్న ఫాక్స్‌కాన్‌ లక్ష్యం దెబ్బ తినే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పందించడానికి ఫాక్స్‌కాన్‌ నిరాకరించింది. తైవాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ ఫాక్స్‌కాన్‌ కంపెనీ యాజమాన్యం ఉద్యోగం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న వారికి 1396 డాలర్లు పరిహారం చెల్లిస్తామని ఆఫర్‌ చేసింది.

 

Tags :