Radha Spaces ASBL

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై అధికార, విపక్షాల మధ్య ప్రతిష్టంభన

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై అధికార, విపక్షాల మధ్య ప్రతిష్టంభన

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై అధికార, విపక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ వేడుకను బహిష్కరిస్తూ విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలోని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. ప్రవాస భారతీయులతో జరిగినసభలో ఆసిస్ ప్రధాని అల్బనీస్, మాజీప్రధాని, విపక్ష ఎంపీలు నేతలు పాల్గొన్నారు. ఓ కమ్యూనిటీ ఈవెంట్‌కు అందరూ కలిసికట్టుగా హాజరయ్యారని.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని విపక్షాలు బహిష్కరిస్తున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష పార్టీల తీరును ప్రధాని ఇలా పరోక్షంగా దుయ్యబట్టారు.

కరోనా సంక్షోభ సమయంలోనూ ఇతర దేశాలకు ఎందుకు వ్యాక్సిన్ పంపిస్తున్నారని విపక్షాలు చేసిన విమర్శల్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇది బుద్ధుడు, గాంధీ తిరిగిన నేల. మనం మన శత్రువుల గురించి కూడా ఆలోచిస్తాం. మనం కరుణతో ప్రేరేపితమైన వ్యక్తులమన్నారు ప్రధాని.

మరోవైపు.. పార్లమెంటు భవనం.. దేశం తీసుకునే అత్యున్నత నిర్ణయాలకు వేదికని..దాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని కాంగ్రెస్ సహా 19 విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటులో ఉభయసభలతోపాటు రాష్ట్రపతి సైతం భాగమని..దాన్ని వాయిదా వేయడం, ప్రారంభించే హక్కు కేవలం రాష్ట్రపతికే ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. విశ్వగురుకు.. దేశ ప్రజాస్వామ్య భావనలపై నమ్మకం లేదని రాహుల్ విమర్శించారు. సభాసంప్రదాయాల్ని మంటగలుపుతూ, విపక్షాల్ని అణిచివేసే చర్యలు చేపట్టారని ఆరోపించారు.

అయితే దీనికి ఎన్డీఏ పక్షాలు సైతం గట్టిగానే కౌంటరిస్తున్నాయి. గతంలో పార్లమెంటు అనుబంధ భవనాలను మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా దేశానికి గర్వకారణమైన పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్‌ చేయడం తప్పుడు చర్యగా అభివర్ణిస్తున్నారు. విపక్షాలు పునరాలోచించాలని సూచిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :