MKOne Telugu Times Youtube Channel

స్థలాలపైనే ఆసక్తి....

స్థలాలపైనే ఆసక్తి....

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ వెలిసిన వెంచర్లలో ఇప్పుడు ఓపెన్‌ ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, గుర్గావ్‌ నగరాలలో ఓపెన్‌ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతోందని  హౌసింగ్‌.కామ్‌ సర్వే ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు అపార్టుమెంట్‌ల కన్నా ఓపెన్‌ ప్లాట్లను కొనేందుకే ఇష్టపడుతున్నారు. సొంతంగా ఉండేందుకు ఇల్లు మొదటి ప్రాధాన్యత పూర్తయితే ఇక వారి లక్ష్యం శివారు ప్రాంతమైనా సరే ఎంతో కొంత స్థలం కొనుగోలు చేయటమే.

మరోవైపు మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు కూడా పెరిగాయని, ఇదే నగరాల్లోని అపార్ట్‌మెంట్ల ధరలలో పెద్దగా పెరుగుదల లేదని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్త్రైమాసికాలలో ఈ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది.  సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్‌ ప్లాట్ల కంటే అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్‌ బ్యాకప్‌, కార్‌ పార్కింగ్‌, క్లబ్‌ హౌస్‌, జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, గార్డెన్‌ వంటి కామన్‌ వసతులు ఉంటాయని అపార్ట్‌మెంట్‌ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. కరోనా వచ్చిన తరువాత కామన్‌ వసతులు వినియోగం, అపార్ట్‌మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడిరది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవటమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు.

రికార్డ్‌ స్థాయిలో

దేశంలోని 8 ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో అత్యధిక లావాదేవీలు జరిగాయి. స్థల లావాదేవీలలో అత్యధిక డీల్స్‌ నివాస విభాగంలోనే జరిగాయి. ఇతర నగరాలతోపాటు పోల్చుకుంటే స్థల లావాదేవీలలో విస్తీర్ణం పరంగా అత్యధికంగా హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి.

 

 

Tags :