ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఓలా, మేలో 35,000 యూనిట్లకు పైగా అమ్మకాలు

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఓలా, మేలో 35,000 యూనిట్లకు పైగా అమ్మకాలు

భారతదేశంలో అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ మే నెలలో 35,000 యూనిట్లకు పైగా విక్రయాలను జరిపి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

దీంతో, ఓలా మే నెలలో 30% పైగా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది మరియు గత సంవత్సరం మే నెలలో జరిగిన విక్రయాలపై 300% వృద్ధిని సాధించింది. గత 3 త్రైమాసికాలుగా అమ్మకాలలో నిలకడగా అగ్రస్థానంలో ఉండటం #EndICEAge మరియు విద్యుదీకరణ దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేయడం పట్ల ఓలా యొక్క నిబద్ధతకు నిదర్శనం.

ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు మరియు CEO భావిష్ అగర్వాల్ మాట్లాడుతూ, “నెలనెలా మా అమ్మకాలు ఆకట్టుకునే వృద్ధిని సాధించాయి మరియు ఓలా భారతదేశంలో EV విప్లవానికి స్థిరంగా నాయకత్వం వహిస్తోంది. ఈ విశేషమైన ఫీట్ మా బ్రాండ్‌పై కస్టమర్ యొక్క అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిబింబించడమే కాకుండా దేశంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన EVల కోసం పెరుగుతున్న డిమాండ్ ను కూడా సూచిస్తుంది. ప్రభుత్వ సబ్సిడీలలో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ, మేము జూన్ నుండి మా స్కూటర్ ధరలను స్వల్పంగా మాత్రమే పెంచి Ola S1ని భారతదేశంలో అత్యుత్తమ EV ప్రతిపాదనగా మార్చాము. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడం మరియు ప్రజలు ప్రయాణించే విధానాన్ని పునర్నిర్వచించడం కోసం ఓలా ఎలక్ట్రిక్ తన లక్ష్యంలో దృఢ నిశ్చయంతో ఉంది."

సవరించిన సబ్సిడీలు జూన్ నుండి అమలులోకి రావడంతో, Ola S1 Pro ఇప్పుడు ₹1,39,999 కి, S1 (3KWh) ₹1,29,999 కి, మరియు S1 Air (3KWh) ₹1,09,999 కి అందుబాటులో ఉన్నాయి. సబ్సిడీలు గణనీయంగా తగ్గినప్పటికీ, ఇంజినీరింగ్ మరియు ఇన్నోవేషన్‌పై ఓలా యొక్క దృష్టి ధర ప్రభావాన్ని తగ్గించడానికి బ్రాండ్‌ను ఎనేబుల్ చేసింది మరియు ఆసక్తికరంగా ఇప్పుడు S1 Pro దాని ప్రారంభ ధరకే రిటైల్ చేయబడుతుంది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి భారతదేశం అంతటా అనేక ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా ఓలా తన ఆఫ్‌లైన్ ఉనికిని చురుకుగా పెంచుతోంది. కంపెనీ ఇటీవలే తన 600వ ECని ప్రారంభించింది మరియు ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని యోచిస్తోంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :