Radha Spaces ASBL

హైదరాబాద్... ఆఫీస్ స్పేస్‌లో తగ్గని డిమాండ్

హైదరాబాద్... ఆఫీస్ స్పేస్‌లో తగ్గని డిమాండ్

రియల్‌ ఎస్టేట్‌రంగంలో ఇతర నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్‌ దూసుకుపోతోంది. రెసిడెన్షియల్‌ పరంగానే కాకుండా, ఆఫీస్‌ స్పేస్‌లో కూడా హైదరాబాద్‌ మొదటినుంచి తొలి ప్రాధాన్యనగరంగా పెట్టుబడిదారులకు కనిపిస్తోంది. దానికితోడు హైదరాబాద్‌లో బహుళ జాతి కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, ఐటీ కంపెనీలు ఎన్నో తమ కార్యాలయాలకు హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకోవడంతో ఇక్కడి ఆఫీస్‌ స్పేస్‌కు బాగా డిమాండ్‌ పెరిగింది. కరోనా తరువాత కూడా హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ తగ్గలేదంటే హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌లో దక్షిణాది నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలదే 66 శాతముందని రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సంస్థ తాజా నివేదికలో వెల్లడిరచింది.

గత ఆర్థిక సంవత్సరం దేశవ్యాప్తంగా కంపెనీలు 2.13 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంటే అందులో మూడు నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలది 1.4 కోట్ల చదరపు అడుగులు( 66 శాతం), అదేవిధంగా ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌, పూణే కలిపి 45.6 లక్షల చదరపు అడుగులు (21 శాతం), దేశ రాజధాని ప్రాంతమైన ఢల్లీిలో 23 లక్షల చదరపు అడుగులు (11 శాతం)గా నమోదైంది. కరోనా ప్రభావం ఉన్నా హైదరాబాద్‌కు మాత్రం ప్రాధాన్యత తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వృద్ధి రేటునే నమోదు చేస్తోంది. ఇదే విషయాన్ని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అధ్యయన సంస్థ ఆనరాక్‌ విడుదల చేసిన రెండో త్రైమాసిక నివేదికలో వెల్లడిరచారు. ఇందుకు కారణం ఆర్థికంగా చాలా రంగాలు ఒడిదుడుకులకు గురైనా ఐటీ రంగం మాత్రం మంచి వృద్ధి రేటును నమోదు చేసింది. ఒకవైపు రియల్‌ ఎస్టేట్‌ రంగం, మరో వైపు హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ రంగం వృద్ధి చెందుతూ బెంగళూరుతో పోటీపడుతోంది. ఆఫీస్‌ స్పేస్‌ సరఫరా, నికరంగా కంపెనీలు స్థలాన్ని లీజుకు తీసుకోవడం, అద్దె పెరుగుదలలో దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్‌ మంచి వృద్ధి రేటును కనబరుస్తోంది.

ముంబయి, పూణే నగరాలు, ఢల్లీి (ఎన్‌సీఆర్‌), కోల్‌కతాల కంటే దక్షిణాదిన ఉన్న మూడు నగరాల్లో హైదరాబాద్‌లో చాలా వేగంగా వృద్ధి రేటు నమోదవుతోందని రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు నిదర్శనం 2021 మొదటి త్రైమాసికంలో బెంగళూరు తర్వాత ఉండే ముంబయి (39 శాతం) పోల్చితే హైదరాబాద్‌లో 46 శాతం వృద్ధి రేటు ఉందని రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అధ్యయన సంస్థ సావిల్స్‌ ఇండియా వెల్లడిరచింది. రాబోయే నాలుగేళ్లలో (2025 నాటికి) హైదరాబాద్‌ మహానగర పరిధిలో ఏకంగా 15 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ ఏర్పాటవుతుందని తాజా అధ్యయనంలో అంచనా వేశారు. ఇప్పటికే నగరంలో సుమారు 7 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ ఐటీ, ఐటీఈఎస్‌, బీపీవో, కేపీవో సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కరోనా సమయంలోనూ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కొత్తగా తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. ప్రధానంగా మాదాపూర్‌ హైటెక్‌ సిటీతో పాటు గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌, కోకాపేట, నానక్‌రాంగూడ, రాయదుర్గం ప్రాంతాల్లో బహుళ జాతీయ, దేశీయ కంపెనీలు తమ సంస్థల ప్రధాన కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ, ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న బెంగళూరును ఆఫీస్‌ స్పేస్‌లో మించిపోయే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు నగరంలోని వెస్ట్‌ జోన్‌లో ఉన్న ఐటీ కారిడార్‌ పరిధిలో సుమారు 25కి పైగా ఉన్న ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఆఫీస్‌ స్పేస్‌తో పాటు నివాస గృహల నిర్మాణాన్ని చేపట్టాయి. చేపట్టిన ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. గచ్చిబౌలి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌, కోకాపేట, నానక్‌రాంగూడ, రాయదుర్గం ప్రాంతాల్లోనే 2లక్షల నుంచి 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసు స్పేస్‌కు సంబంధించిన హైరైజ్‌ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. 40 అంతస్తుల నుంచి 58 అంతస్తుల్లో వ్యాపార, నివాస భవనాలను నగరంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణంలో దివ్యశ్రీ డెవలపర్స్‌, జీఏఆర్‌ కార్పొరేషన్‌, ఫీనిక్స్‌, ఆర్‌ఎంజెడ్‌, సలార్‌పూర్‌ సత్వ, కె.రహేజా గ్రూప్‌, మై హోమ్‌, వంశీరామ్‌, ప్రెస్టేజీ వంటి నిర్మాణ రంగ సంస్థలు సుమారు 6-7 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్‌ స్పేస్‌ను నిర్మించే పనిలో ఉన్నాయి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :