ఫ్లాపు డైరెక్టర్లకు వరంగా మారిన ఎన్టీఆర్
![ఫ్లాపు డైరెక్టర్లకు వరంగా మారిన ఎన్టీఆర్](https://www.telugutimes.net/storage/news/news_new_79568.jpg)
ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) కు హిట్ డైరెక్టర్ల వెంట పడతాడని పేరుండేది. అతనొక్కడే(Athanokkade), కిక్(Kick) తర్వాత సురేందర్ రెడ్డి(Surender reddy)తో, కందిరీగ(Kandireega) సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్(Santhosh Srinivas) తో, లెజెండ్(Legend) తర్వాత బోయపాటి(Boyapati)తో, గబ్బర్ సింగ్(Gabbar Singh) తర్వాత హరీష్ శంకర్(Harish Shankar) తో ఇలా సక్సెస్ఫుల్ డైరెక్టర్లతో సినిమాలు చేయడమే ఎన్టీఆర్ కు ఆ పేరురావడానికి కారణం.
ఎన్టీఆర్ అలా చేసిన అశోక్(Ashok), ఊసరవెల్లి(Oosaravelli), రభస(Rabhasa), దమ్ము(Dhammu), రామయ్యా వస్తావయ్యా(Ramayya Vasthavayya) సినిమాలు ఆయనకు ఫ్లాపులనే మిగిల్చాయి. కానీ ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ రూట్ పూర్తిగా మారిపోయింది. తారక్(Tarak) ఫ్లాపు డైరెక్టర్లతో వర్క్ చేసి వారికి హిట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఫ్లాపుల్లో ఉన్న పూరీ జగన్నాథ్(Puri Jagannadh)తో టెంపర్(Temper) చేసి పూరీని సక్సెస్ ట్రాక్ ఎక్కించాడు ఎన్టీఆర్.
తర్వాత 1 నేనొక్కడినే(1 Nenokkadine)తో ఫ్లాప్ అందుకున్న సుకుమార్(Sukumar) తో నాన్నకు ప్రేమతో(Nannaku Prematho) చేసి హిట్ ఇచ్చాడు. సర్దార్ గబ్బర్ సింగ్(Sardaar Gabbar Singh) తో దారుణమైన ఫలితాన్ని అందుకున్న బాబీ(bobby)తో జై లవకుశ(Jai Lava Kusa) చేసి విజయం సాధించాడు. అజ్ఞాతవాసి(Agnyathavaasi) సినిమాతో డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్(Trivikram) తో అరవింద సమేత(Aravind Sametha) చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ కొరటాల(Koratala)తో కూడా ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ ను వర్కవుట్ చేశాడు. కొరటాల చివరి సినిమా ఆచార్య(Acharya) ఎలాంటి డిజాస్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా సరే కొరటాలను నమ్మి ఎన్టీఆర్ దేవర(Devara) చేశాడు. దేవరకు మొదటి రోజు మిక్డ్స్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం బావున్నాయి. సో కొరటాలకు కూడా ఎన్టీఆర్ హిట్ ఇచ్చినట్టే. దీంతో ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇస్తాడనే తారక్ పేరు ఇప్పుడు మరింత బలపడింది.
![praneet](https://www.telugutimes.net/storage/advertisements/zA7EkLRywN7YzknFTCUKYOKP9Q302CcAaDDlxSws.jpg)
![praneet](https://www.telugutimes.net/storage/advertisements/RNwHnj7MXzO9l4WQ9eDQCnxNeUMnfE86iSZsIX1e.jpg)
![praneet](https://www.telugutimes.net/storage/advertisements/x4YtAuthlgCi8SBjrvlkSJntYRhQUuOZF67Peh2J.jpg)
![ASBL](https://www.telugutimes.net/storage/advertisements/LSdaO4EI5wmVbOprwPdTBLjMgLr0NrKLWkmNXByu.jpg)
![Radhey Skye]( https://www.telugutimes.net/storage/advertisements/mSxNVVoW52QKnvqQWkxPYAoWD0XGyVI9KA4d2BE7.jpg)
![Radha Spaces]( https://www.telugutimes.net/storage/advertisements/krIlpNwsfU4Zr5KksJ8qlUpYV5fLLKDmDqrWq03p.jpg)