Radha Spaces ASBL

సీఎం సీఎం ఎన్టీఆర్..! జూనియర్ ను వెంటాడుతున్న నినాదాలు..!!

సీఎం సీఎం ఎన్టీఆర్..! జూనియర్ ను వెంటాడుతున్న నినాదాలు..!!

జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే నినాదాలు ఊపందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ కు ఆయనే సరైన వారసుడు అనే వాళ్లూ లేకపోలేదు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ లీడ్ చేస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో వరస ఓటములతో తెలుగుదేశం పార్టీ విలవిలలాడుతోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ యాక్టివ్ రోల్ పోషించాలనే డిమాండ్ ఊపందుకుంది.

తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఎన్టీఆర్ గతంలో ప్రచారం చేశారు. తాను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని కూడా గతంలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. అతన తన సొంతపార్టీ అని ఎన్టీఆర్ భావిస్తారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన ప్రచారానికి రాలేదు. చంద్రబాబు ఫ్యామిలీతో దూరం పెరగడమే ఇందుకు కారణమనే ఊహాగానాలు వినిపించాయి. చంద్రబాబు కూడా ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదు. దీంతో ఈ గ్యాప్ నిజమేనని అందరూ భావించారు. అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ పరిస్థితి దిగజారుతోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పాలిటిక్స్ లోకి రావాలనే డిమాండ్ పెరుగుతోంది.

మొన్న పంచాయతీ ఎన్నికల సమయంలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబుకు కూడా జూనియర్ ఎన్టీఆర్ సెగ తగిలింది. ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. ఆయన్ను ప్రచారానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తన ఎదుటే జైఎన్టీఆర్ నినాదాలు చేయడంతో చంద్రబాబు ఖంగుతున్నారు. వారి డిమాండ్ లు విన్న తర్వాత నవ్వుతూ తలూపారు. 

ఈ మధ్య ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ను ఓ విలేఖరి కూడా ఇదే ప్రశ్న అడిగారు. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారని ప్రశ్నించారు. అయితే ఇది సమయం., సందర్భం కాదని.. మరోసారి దీనిపై తాపీగా చర్చించుకుందామని ఎన్టీఆర్ బదులిచ్చారు. అయితే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందని కానీ, లేదని కానీ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం పక్కా అనే చర్చ జోరందుకుంది.

తాజాగా తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ కు మరోసారి నినాదాలు వెంటాడాయి. ఈసారి ఏకంగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు అభిమానులు. దీంతో కాస్త అసహనానికి గురైన ఎన్టీఆర్.. ఆగండి బ్రదర్.. అంటూ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మైక్ పట్టుకోగానే హాల్ అంతా సీఎం సీఎం నినాదాలతో మార్మోగిపోయింది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఏదైతేనేం.. ఎన్టీఆర్ జపం ఎక్కువైపోయింది. మరి ఆయన భవిష్యత్ వ్యూహం ఏంటనేది మాత్రం ఇప్పటికి అంతుచిక్కట్లేదు. టీడీపీ శ్రేణులు కూడా ఆయన వస్తేనే బాగుంటుందని భావిస్తున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :