మెల్‌బోర్న్‌ విక్టోరియా పార్లమెంటులో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

మెల్‌బోర్న్‌ విక్టోరియా పార్లమెంటులో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. అక్కడి మెల్‌బోర్న్‌ విక్టోరియా పార్లమెంటు హాలులో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, చిన్న కుమార్తె తేజస్విలనిలను ఘనంగా సన్మానించారు. పార్లమెంటు సభ్యుడు స్టీవ్‌మిగ్గ్య్‌ వారికి జ్ఞాపిక అందజేశారు. గొప్ప నటుడిగానే కాకుండా రాజకీయాల్లో ప్రవేశించి తెలుగువారికి గుర్తింపు తెచ్చినందుకు అక్కడి పార్లమెంటులో ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల నిర్వహణకు అనుమతి లభించిందని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఎన్‌ఆర్‌ఐ లగడపాటి సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నన్నూరి నర్సిరెడ్డి, గన్నమనేని మురళీకృష్ణ, జీఎంఆర్‌ రాజారెడ్డి, సిసింద్రి,  ఎన్టీఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :