ఫిలడెల్ఫియా తెలుగుదేశం ఎన్నారై ఆధ్వర్యంలో శాంతి హోమం

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని, ఆయురారోగ్యాలని ప్రసాదించాలని ఫిలడెల్ఫియా ఎన్నారైలు శాంతి హోమం నిర్వహించారు. శనివారం నాడు ఫిలడెల్ఫియాలోని మాల్వేర్న్ సాయిబాబా మందిరంలో వేద పండితులతో నిర్వహించిన శాంతి హోమంలో మూడు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుజాతి పునర్వైభవానికి కృషి చేస్తారని అభిలషించారు. ఫిలడెల్ఫియా తెలుగుదేశం ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్బంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.







Tags :