ఆ డాక్యుమెంటరీ గురించి తమకు తెలియదు ... అమెరికా

ప్రధాని నరేంద్ర మోదీపై బీజేపీ రూపొందించని డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపిన సంగతి విదితమే. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, ఆ ఉదంతంలో నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల గురించి డాక్యుమెంటరీలో ప్రశ్నలు లేవనెత్తడం వివాదాస్పదమైంది. తాజాగా ఈ అంశంపై అమెరికా స్పందించింది. మీరు చెబుతున్న డాక్యుమెంటరీ గురించి మాకు తెలియదు. రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్యలుగా అమెరికా, భారత్‌కు వాటి భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. భారత ప్రజాస్వామ్యం శక్తిమంతమైనది. ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై మా దృష్టి ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు. అలాగే రెండు దేశాల బంధాన్ని బలోపేతం చేసే అంశాలను గురించే తాము ఆలోచిస్తామని ఆయన తెలిపారు. ఉభయ దేశాల మధ్య సన్నిహిత రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. అమెరికా, భారత్ ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు.