ప్రత్యేక హోదాపై...మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

ప్రత్యేక హోదాపై...మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయి.  రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాం 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రత్యేక సాయం చేయడానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని మిగిలిన వాటికి కొంత సమయం ఉందని కేంద్ర హోం శాఖ పేర్కొంది.

 

Tags :