నిజామాబాద్‌ జిల్లా వాసి అమెరికాలో రోడ్డు ప్రమాదం, దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మహేష్ బిగాల 

నిజామాబాద్‌ జిల్లా వాసి అమెరికాలో రోడ్డు ప్రమాదం, దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మహేష్ బిగాల 

అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. భీమ్‌గల్‌ మండలం బడాభీమ్‌గల్‌ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతల సత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు శైలేష్‌(21) బీటెక్‌ పూర్తిచేసి ఉన్నత విద్య కోసం గతేడాది న్యూజెర్సీకి వెళ్లాడు. శైలేష్‌ ప్రయాణిస్తున్న కారు పెట్రోల్‌ ట్యాంక్‌ పేలి మంటలు చెలరేగడంతో అతడు మంటల్లో కాలిపోయి మృతి చెందాడు, మహేష్ బిగాల మాట్లాడుతూ  శైలేష్‌ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడానికి అన్ని విధాలా అక్కడ వున్న ఇండియన్ కాన్సులేట్ న్యూయార్క్, తానా నుంచి లక్ష్మి దేవి మరియు చిట్టి బాబు, తెలంగాణ ఎన్నారై డిపార్ట్మెంట్ వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. శైలేష్‌ మరణం కుటుంబ సభ్యులకే కాకుండా అందరిని కలిచి వేసింది అని అన్నారు. అలాగే భీంగల్ ఎంపీపీ మహేష్, సర్పంచ్ - సంజీవ్ లతో ఇక్కడ సమన్వయము చేసుకుంటున్నారని చెప్పేరు. ఈరోజు వారాంతం వున్నoదున  వీలైనంత త్వరలో మృతదేహాన్ని తెప్పించే ప్రయంత్నం చేస్తున్నామని అన్నారు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరితిత్తిని ఎప్పటికపుడు పర్యవేక్షితున్నారని అన్నారు.

 

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :