ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఓటీటీలో షురూ అవుతున్న సరికొత్త టాక్ షో...

ఓటీటీలో షురూ అవుతున్న సరికొత్త టాక్ షో...

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో టాక్ షో ట్రెండ్ నడుస్తుంది. బాలీవుడ్ లో ఏ ముహూర్తాన కరణ్ జోహార్ " కాఫీ విత్ కరణ్ " అనే షో ని స్టార్ట్ చేసాడో కానీ, ఆ ఫీవర్ టాలీవుడ్ కి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ చానెల్స్ లో ఈ టాక్ షో లకి ఫుల్ డిమాండ్ ఉంది. అతి తక్కువ కాలం లోనే ఈ షోస్ హిట్ అవ్వడం, టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ ఉండడం విశేషం. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో అయితే కింగ్ అఫ్ టాక్ షోస్ అనిపించుకుంటుంది అంటే అతిశయోక్తి కాదు. బాలయ్య కంటే ముందు ఆహా ప్లాట్ ఫామ్ గా హీరో దగ్గుబాటి రానా హోస్ట్ చేసిన " నెంబర్ వన్ యారి " షో కూడా సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన సోనీ లివ్ వేదికగా, పాప్ సింగర్ గా పేరు సంపాదించిన సింగర్ స్మిత హోస్ట్ గా ఒక టాక్ షో ప్రారంభం కాబోతుంది. ఈ షో " నిజం విత్ స్మిత " అనే టైటిల్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ టాక్ షో కి స్మిత హోస్ట్ గా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నారు.

తాజాగా సోనీ లివ్ లో ప్రోమో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంటర్వ్యూలో ఈ సింగర్ అడిగిన బోల్డ్ ప్రశ్నలకి సెలెబ్రెటీస్ ఆన్సర్స్ చెప్పడం విశేషం. అయితే సోనీ లివ్ లో తెలుగులో ఇది మొదటి టాక్ షో కావడంతో ప్రేక్షకుల్లో ఈ షో ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి నెలకొంది. ఇటు సినిమా సెలెబ్రేటిస్, అటు రాజకీయ నాయకులు సైతం ఈ షో లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10 నుండి ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే నిజం విత్ స్మిత ప్రోమో రిలీజై అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రోమో ద్వారా ఈ షో పై అంచనాలు పెరిగిపోయాయని చెప్పొచ్చు. ఇక అన్ని టాక్ షోస్ లాగానే ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో స్మిత షో ఉండబోతుందా? ఆద్యంతం ఉత్కంఠ రేపే ప్రశ్నట్లతో ప్రేక్షకులని అలరించనుందా? తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :