ASBL NSL Infratech
facebook whatsapp X

అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌తో మండే టెస్ట్ పాస్ అయిన ‘కమిటీ కుర్రోళ్ళు’

అన్నీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌తో మండే టెస్ట్ పాస్ అయిన ‘కమిటీ కుర్రోళ్ళు’

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం మండే టెస్ట్ కూడా పాస్ అయ్యింది. అలాగే అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌టం విశేషం.

‘కమిటీ కుర్రోళ్ళు’ నాలుగు రోజుల్లో రూ. 7.48 కోట్లు వచ్చాయి. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.  సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ తెలియజేసింది.
 

https://x.com/PinkElephant_P/status/1823232845487239489

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :