Radha Spaces ASBL

నిహార్‌ గ్లోబల్‌ విస్తరణ...3 కొత్త అనుబంధ సంస్థల చేరిక

నిహార్‌ గ్లోబల్‌ విస్తరణ...3 కొత్త అనుబంధ సంస్థల చేరిక

హైదరాబాద్‌కు చెందిన ఐటి సంస్థ నిహార్‌ గ్లోబల్‌ తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా 3 కొత్త అనుబంధ కంపెనీలను చేర్చుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. నిహార్‌ మైనింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నిహార్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మరియు లైఫ్‌ 108 హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ను తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా చేర్చుకున్నామని పేర్కొంది. ఖనిజ మైనింగ్‌ వ్యాపారం చేస్తున్న నిహార్‌ మైనింగ్‌ సంస్థ ఇటీవల కొనుగోలు చేసిన వైఎస్‌ఆర్‌ కడప డిటిలోని బారైట్స్‌ మరియు డోలమైట్‌ కోసం 8 హెక్టార్ల క్వారీ లీజును పొందింది. నిహార్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ సౌర వ్యవస్థల తయారీ, వ్యాపారం మరియు ఇన్‌ స్టలేషన్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. లైఫ్‌ 108 హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆన్‌లైన్‌లో హెల్త్‌కేర్‌ ఉత్పత్తులు మరియు పరికరాలను విక్రయించే వ్యాపారాన్ని చేస్తోంది. ఈ మూడు కంపెనీల చేరికతో తమ షేర్లపై పెట్టుబడులు మరింత లాభాలను తెచ్చిపెడుతుందని కంపెనీ చెబుతోంది. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :