ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలుగు కుర్రాడికి ప్రతిష్టాత్మక అవార్డు

తెలుగు కుర్రాడికి ప్రతిష్టాత్మక అవార్డు

అమెరికాలో తెలుగు కుర్రాడు నిహాల్‌ తమ్మన సత్తా చాటాడు. వాడి పడేసిన బ్యాటరీలు రీసైకిల్‌ చేస్తున్నందుకు సీఎన్‌ఎన్‌ హీరోస్‌ యంగ్‌ వండర్‌ అవార్డు కైవసం చేసుకున్నాడు. 13 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించారు. వాడి పడేసిన బ్యాటరీలు పర్యావరణానికి హానికరం. అందులోని కెమికల్స్‌  మట్టిని, నీటిని కలుషితం చేస్తాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల భ్యాటరీలను పడేస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో 10 ఏళ్ల పసిప్రాయంలోనే గుర్తించాడు నిహాల్‌.  2019లోనే రీసైకిల్‌ మై బ్యాటరీ క్యాంపెయిన్‌ ప్రారంభించాడు. బ్యాటరీ రీసైకిల్‌పై అమెరికాలోని స్కూళ్లు తిరిగి విద్యార్థులకు అవగాహన కల్పించాడు. తనతో కలిసి స్వచ్ఛందంగా పనిచేసేందుకు 300 సభ్యుల టీంను ఏర్పాటు చేసుకున్నాడు. వాడిపడేసే బ్యాటరీల కోసం స్కూళ్లు, ఇతర ప్రదేశాల్లో ప్రత్యేక బిన్‌లు ఏర్పాటు చేశారు. మూడేళ్లలో మొత్తం 2,25,000 బ్యాటరీలను సేకరించి వాటిని రీసైకిల్‌ చేశాడు. నిహాల్‌ ప్రతిభను గుర్తింన సీఎన్‌ఎన్‌ యంగ్‌ వండర్‌ అవార్డుతో గౌరవించింది. భవిష్యత్తుల్లో ప్రపంచమంతా రీసైక్లింగ్‌ బ్యాటరీ సేవలను విస్తరించి పర్యావరణాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిహాల్‌ తెలిపారు.  నిహాల్‌ తెలుగు మూలాలున్న ఇతని  కుటుంబం అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నివసిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :