అమెరికా కీలక నిర్ణయం... ఏడేళ్లకే గ్రీన్‌కార్డు !

అమెరికా కీలక నిర్ణయం... ఏడేళ్లకే  గ్రీన్‌కార్డు !

ప్రవాసులకు తమ దేశ పౌరసత్వం ఇచ్చే విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న వారికి గ్రీన్‌కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇమిగ్రేషన్‌ చట్ట సవరణను సెనెట్‌ ముందుంచింది. కొన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న సెనెట్‌ ముందుంచింది. కొన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న టెక్‌ నిపుణులకు లబ్ది చేకూర్చేలా నిబంధనలు సవరిస్తూ రూపొందించిన బిల్లును అమెరికా సెనెట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అమెరికాలో వరుసగా ఏడేండ్లు పనిచేస్తే గ్రీన్‌ కార్డు పొందడానికి అర్హత సాధించినట్లే. ఈ బిల్లును సెనేటర్‌ అలెక్స్‌ పాడిల్లా ప్రతిపాదించగా, ఇతర సెనెటర్లు ఎలిజబెత్‌ వారెన్‌, బెన్‌రాయ్‌ లుజాన్‌, డిక్‌ దుర్బిన్‌ మద్దతు పలికారు. అమెరికా ప్రజా ప్రతినిధుల సభలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.  కాంగ్రెస్‌ ఉమన్‌ జో లాఫ్‌గ్రెన్‌, ఓలాప్‌ గ్రెన్‌ ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌ హౌస్‌ సబ్‌ కమిటీ చైర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

ఈ బిల్లు చట్టంగా మారితే, డ్రీమర్‌లు, బలవంతంగా స్థానభ్రంశం చెందిన పౌరులు, బహిష్కరణను ఎదుర్కొనే దీర్ఘకాలిక వీసా హోల్డర్‌ల పిల్లలు, కార్మికుల, అత్యంత నైపుణ్యం కలిగిన సభ్యులతో సహా 80 లక్షల మంది గ్రీన్‌కార్డు పొందేందుకు ఈ చట్టం మార్గన్ని సుగమం చేస్తుంది. దేశాల వారీగా కోటా ప్రకారం అమెరికా జారీ చేస్తున్న గ్రీన్‌ కార్డు కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న భారతీయ నిపుణులు అత్యధికంగా లబ్ది పొందుతారని భావిస్తున్నారు. ఈ బిల్లు ప్రకారం వలసదారుడు కనీసం ఏడు సంవత్సరాలు అమెరికాలో పనిచేస్తున్నట్లయితే, చట్టబద్దమైన శాశ్వత నివాస యోగ్యత (పౌరసత్వం) లభిస్తుంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.