Radha Spaces ASBL

పంచ‌తంత్ర క‌థ‌లు చిత్రంలోని 'నేనేమో మోతెవ‌రి' లిరిక‌ల్ వీడియోసాంగ్

పంచ‌తంత్ర క‌థ‌లు చిత్రంలోని 'నేనేమో మోతెవ‌రి' లిరిక‌ల్ వీడియోసాంగ్

నేనేమో మోతెవరి..నువ్వేమో తోతాపరి...
నా గుండెల రాసరి..కుర్సియేసి కూసొబెడనే...
నీ అయ్యా ట్వారి..నీ చిచ్చా దార్కారి...
ఏదైతే ఏందే రి...నిన్నుఎత్తుకొనిబోతనే...

అంటూ ఆహ్లాద‌ర‌క‌రంగా సాగే ఈ పాట `పంచతంత్ర క‌థ‌లు` చిత్రంలోనిది. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి. మ‌ధు నిర్మిస్తున్నారు. గంగ‌న‌మోని శేఖ‌ర్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఐదు వేరు వేరు క‌థ‌ల‌ ఆంథాల‌జి కావ‌డంతో ఈ మూవీకి `పంచ‌తంత్ర క‌థ‌లు` అనే యాప్ట్ టైటిల్ పెట్ట‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మొద‌టి పాట `మోతెవ‌రి` లిరిక‌ల్ వీడియో సాంగ్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ విడుద‌ల చేశారు.

ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించ‌గా సంగీత ద‌ర్శ‌కుడు క‌మ్రాన్ క్యాచీ ట్యూన్‌తో స్వ‌ర‌పరిచాడు. ఇక లేటెస్ట్ సెన్సేష‌న్ రామ్ మిరియాల ఈ పాట‌ను త‌న‌దైన శైలిలో ఆల‌పించి ఇన్‌స్టంట్ చార్ట్ బ‌స్ట‌ర్  లీస్ట్‌లో చేర్చారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో అద్భుత‌మైన రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. సాంగ్ విడుద‌ల సంద‌ర్భంగా..

ర్శకుడు రుణ్ భాస్కర్ మాట్లాడుతూ - ``పంచ‌తంత్ర క‌థ‌లు సినిమాలోని `నేనేమో మోతెవ‌రి` సాంగ్ రిలీజ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫేవ‌రేట్ సాంగ్‌. ఈ సినిమా ర‌ఫ్ క‌ట్ చూసిన‌ప్పుడే ఈ సాంగ్ విన‌డం జ‌రిగింది. చాలా ఇన్స్‌పైరింగ్ సాంగ్‌. త‌ప్ప‌కుండా వైర‌ల్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం. కాస‌ర్ల శ్యామ్ గారు మంచి సాహిత్యం అందించారు. రామ్ మిరియాల అంద‌రి ఫేవ‌రేట్‌. ఇక సంగీత ద‌ర్శ‌కుడు కమ్రాన్ చాలా కాలంగా తెలుసు. మంచి ట్యూన్ ఇచ్చారు. లిరిక‌ల్ వీడియోలో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ మేకింగ్‌, విజువ‌ల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో చాలా పెద్ద‌ క్యాస్టింగ్ ఉంది. స‌ర్‌ప్రైజింగ్‌గా  మా అమ్మ‌గారితో కూడా ఒక క్యారెక్ట‌ర్ చేయించారు. ఈ సినిమా కోసం ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.  

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :