మరోసారి దేవతగా నయన్

మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా సినిమా భక్త కన్నప్ప. ముందు ఈ సినిమా గురించి అసలెవరూ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్ర చేయనున్నాడని వార్తలొచ్చాయో ఒక్కసారిగా ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీల దృష్టి పడింది. దానికి తోడు రీసెంట్‌గా హీరోయిన్ నపూర్ సనన్ సినిమా నుంచి తప్పుకోవడం కూడా సినిమా గురించి తెలిసేలా చేసింది.
కాకపోతే హీరోయిన్ ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకే తప్పుకుందని స్వయంగా మంచు విష్ణు క్లారిటీ ఇవ్వడంతో ఇదేమీ పెద్దగా కాంట్రవర్సీలు కాలేదు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా వార్తలోకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ మహాశివుడిగా కనిపించనుండగా, ఆయన పక్కన పార్వతీ దేవిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనుందని తెలుస్తోంది.
వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చి 18 ఏళ్లవుతుంది. వీరి కాంబోలో వచ్చిన యోగి సినిమా మంచి రిజల్ట్ ను ఇవ్వకపోయినా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కవుట్ అయింది. ఈ సినిమాలో నయన్ కోసం ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, ఆమె కూడా దాదాపు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా మెప్పించిన నయన్ ను ఇప్పుడు పార్వతీ దేవిగా చూడ్డానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






