ASBL Koncept Ambience
facebook whatsapp X

'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్

'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్

తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, సినిమాల్లో అద్భుతమైన నటనతో అలరిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార ' బియాండ్ ది ఫెయిరీ టేల్'తో ఆమె ప్రయాణం గురించి అభిమానులకు ప్రత్యేక గ్లింప్స్ ని అందిస్తున్నారు. నవంబర్ 18న నయనతార పుట్టినరోజున నెట్‌ఫ్లిక్స్‌లో ఇది విడుదల కానుంది.  

చాలా సంవత్సరాలుగా తన జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకున్న నయనతార మునుపెన్నడూ చూడని పార్శ్వాన్ని ఎక్స్ ఫ్లోర్ చేసేలా ఈ డాక్యు-ఫిల్మ్ వీక్షకులను అలరించనుంది. కుమార్తె, సోదరి, పార్ట్నర్, తల్లి, స్నేహితురాలు, పరిశ్రమలో పవర్ హౌస్ గా ఆమె పాత్రల గురించి ఎన్నో అద్భుతమైన విషయాలతో కూడుకున్న ఈ చిత్రం అభిమానులకు ఓ ట్రీట్ లా వుండబోతోంది.

భారతదేశంలోని నయనతార అభిమానుల కోసం నెట్‌ఫ్లిక్స్ అల్టిమేట్ బర్త్ డే గిఫ్ట్ అందజేస్తున్నందున, ఆమె అఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఐకానిక్ ప్రజెన్స్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు ఆనందంలో ఉన్నారు.

మార్క్ యువర్ క్యాలెండర్. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 18న Netflixలో.. గెట్ రెడీ.
 

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :